నేడుజరగబోయే దీక్ష దివాస్ ను విజయవంతం చేయాలని……….. బిఆరస్ జిల్లా అధికార ప్రతినిధివాకిటి.శ్రీధర్ పిలుపు
సాక్షిత వనపర్తి
ఆర్.టి.సి రిటైర్మెంట్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు.
మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యములో దీక్షా దివాస్ కార్యక్రమం మధ్యాహ్నం 3.00గంటలకు జరగనుంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆర్.టి.సి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులను మరియు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులను బస్ స్టాండ్ నందు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవన్ నందు వాకిటి.శ్రీధర్ కలసి కార్యక్రమానికి హాజరై సహకరించగలరు అని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వాకిటి.శ్రీధర్ మాట్లాడుతూ 11రోజులు తెలంగాణ నలుదిశలను ఏకం చేసిందని,కె.సి.ఆర్ శవయాత్రనో…తెలంగాణ జైత్రయాత్రనో అని గర్జించే దైర్యం ప్రజలకు కల్పించి రాష్టం సాధించిన ఘనత కె.సి.ఆర్ ది అని అన్నారు.
14ఏండ్ల ఉద్యమ చరిత్ర, 10ఏండ్ల కె.సి.ఆర్ సుపరిపాలన గురించి ప్రజలకు,నవ యువకులకు తెలిపే విధంగా వేడుకలు ఉంటాయని సీనియర్ సిటిజన్స్ గా మీరు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమములో నందిమల్ల.అశోక్, ప్రేమ్ నాథ్ రెడ్డి, ఆర్టీసీ నాయకులు సత్యనారాయణ చారి రామచంద్రారెడ్డి రాఘవ రెడ్డి నారాయణ్ గౌడశ్రీనివాసులు జానంపేట.శ్రీనివాసులు,చిట్యాల.రాము తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
