కార్యసిద్ధిని కలిగించే దైవం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
జిహెచ్ఎంసి కొంపల్లి సర్కిల్ పరిధి జయభేరి కాలనీ నల్ల పోచమ్మ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ గణపతి, కాశీ విశ్వనాథ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూర్చే దైవం వినాయకుడని, లక్ష్మీ గణపతి స్వామి కృపా కటాక్షాలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆదిరెడ్డి రవీందర్ రెడ్డి, సభ్యులు రామ్మోహన్, నరసింహ, నరేందర్ రెడ్డి, మహబూబ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మనోజ్ కుమార్, విశ్వనాథ శర్మ, ఆదిరెడ్డి రాజిరెడ్డి, ఓబి రాజు, గోపాల్ రెడ్డి, మల్లారెడ్డి, జి రాజిరెడ్డి, సంజీవరెడ్డి, సదానందం, విలాస్ కుమార్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
