పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా…
జిల్లా సరిహద్దు చెక్‌పోస్టును తనిఖీ చేసిన మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కలమడుగు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టును తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఏసీపీ పలు కీలక సూచనలు చేశారు.ఆయన మాట్లాడుతూ, పండుగ నేపథ్యంలో పశువులను అక్రమంగా తరలించే వాహనాల తనిఖీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల సరిహద్దుల నుంచి జరిగే పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లా సరిహద్దుల గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని,ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
