నీటి సమస్యను పరిష్కరించండి.సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

Sakshitha news

నీటి సమస్యను పరిష్కరించండి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

ప్రజావాని సందర్బంగా సిపిఐ నాయకులు ఐడిపిఎల్ లోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో నీటి సమస్యపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ మండలం పరిధిలో మంచి నీటి సరఫరా గతంలో నిర్థిష్ట సమయంలో సరఫరా జరిగేదని కానీ గత కొన్ని వారాలుగా సమయపాలన పాటించకుండా ఇష్ట రితిన విడుదల చేస్తున్నారని దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.అదే విధంగా గతంలో గంటన్నర,రెండు గంటలు నీటిని సరఫరా చేస్తే నేడు కేవలం అర్ధగంట మాత్రమే విడుదల చేస్తున్నారాని దీని వల్ల ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులకు గురవుతున్నారని కావున వెంటనే పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.
జనరల్ మేనేజర్ మాధవి గారు వచ్చే వారం లోపు సమస్యను పరిష్కరిస్తానని అన్నారు లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని సిపిఐ నాయకులు అధికారికి చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, మండలం కార్యదర్శి స్వామి, సహాయ కార్యదర్శి రాములు,శాఖ కార్యదర్శి సహదేవ రెడ్డి, వెంకటేష్,ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబు,మాజీ కౌన్సిలర్ నర్సయ్య,సిపిఐ నాయకులు మల్లేష్,యాదయ్య,బాబు,శ్రీను,ఇమామ్,రాజేశ్వర్ రావ్ తదితరులు పాల్గొన్నారు.
Scroll to Top