విధి నిర్వహణలో నిర్లక్ష్యం : పంచాయతీ కార్యదర్శులకు సోకాజ్ నోటీసులు
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కోయరంగాపురం, అనంతారం పంచాయతీ కార్యదర్శులు క్రాంతి కుమార్,విజయలక్ష్మి లకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోకాజ్ నోటీసులు జారీ చేశారు. జూలై 1 నుంచి 30 వరకు వీరు తప్పుడు హాజరు నమోదు చేసినట్లు కలెక్టర్ గుర్తించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు వారిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ నోటీసులు పై వారు సరైన వివరణ ఇవ్వలేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
