సోషల్ మీడియా అవగాహన సదస్సు : ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియ చేయాలి ఎమ్మెల్యే జారే
సాక్షిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సోషల్ మీడియా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నుంచి సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొని సోషల్ మీడియా పరిజ్ఞానాన్ని అందించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఐదు మండలాలకు చెందిన గ్రామపంచాయతీలలో కాంగ్రెస్ పార్టీకి ఇటీవల నియమితులైన సోషల్ మీడియా ఇన్‌చార్జులకు సమాజంలో జరుగుతున్న టెక్నాలజీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా చేరవేసే సాధనంగా సోషల్ మీడియాను ఉపయోగించాల్సిన అవసరాన్ని ఎమ్యెల్యే వివరించారు. ప్రజలతో నేరుగా మమేకమయ్యే వేదికగా సోషల్ మీడియా ఉండాలన్నారు. పల్లెపల్లెకు పార్టీ సంక్షేమ పథకాలు చేరేలా డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించాలని సూచించారు.
యువతతో పాటు మహిళలు కూడా సోషల్ మీడియాలో చురుకుగా ఉండాలని పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల ముఖ్య నాయకులు మహిళా నాయకులు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ లు తదితరులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
