సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు స్ఫూర్తిదాయకం….

Sakshitha news

సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు స్ఫూర్తిదాయకం….

తెలుకుంటలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ విజయరమణారావు….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, జూలపల్లి/ తెలంగాణ గడ్డపై వీరత్వానికి, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ. జయంతి సందర్భంగా జూలపల్లి మండలం తెలుకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆవిష్కరించారు.

తెలుకుంట గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని గౌడ సంఘం నాయకులు, గ్రామ పెద్దలతో కలిసి ప్రభుత్వ విప్ విజయరమణారావు ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ధైర్యసాహసాలు, పోరాట పటిమ, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల కోసం పోరాడిన పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం నెలకొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మార్కెట్ చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గౌడ సంఘం నాయకులు, యువజన నాయకులు, గ్రామ గౌడ సంఘం పెద్దలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top