ప్రజల సమగ్ర ఆరోగ్య రక్షణకోసమే ‘సంజీవని’ : ప్రత్తిపాటి

Sakshitha news

ప్రజల సమగ్ర ఆరోగ్య రక్షణకోసమే ‘సంజీవని’ : ప్రత్తిపాటి

  • సమగ్ర ఆరోగ్య భద్రతా పథకమైన సంజీవనితో ప్రజల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం
  • 30 మంది లబ్ధిదారులకు రూ.16లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ నగదు చెక్కులు అందించిన మాజీమంత్రి ప్రత్తిపాటి.

ప్రజలెవరూ తమ ఆరోగ్య సమస్యలపై అదైర్యపడవద్దని, వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరికీ మెరుగైన, నాణ్యమైన వైద్యసేవల్ని కూటమిప్రభుత్వం ఉచితంగానే అందించబోతోందని, రాష్ట్ర ప్రజల సమగ్ర ఆరోగ్య రక్షణే ద్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

మంగళవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి సమస్య్లల తాలూకా అర్జీలు స్వీకరించిన అనంతరం, లబ్ధిదారులకు సీఎం.ఆర్.ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) నగదు చెక్కుల్ని పంపిణీ చేసి, వారి కుటుంబపరిస్థితులు..అనారోగ్య సమస్యల గురించి తెలుసుకున్నారు. 30 మంది లబ్ధిదారులకు రూ.16లక్షల విలువైన చెక్కుల్ని అందించిన అనంతరం ప్రత్తిపాటి మాట్లాడారు.

ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల సమగ్ర ఆరోగ్య బీమా
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరక ఆరోగ్య బీమా అందించే విప్లవాత్మక యూనివర్సల్ హెల్త్ పాలసీని అందిస్తూ సంజీవని పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త పథకానికి శ్రీకారం చుట్టునన్నారని ప్రత్తిపాటి చెప్పారు. ప్రజల సమగ్రఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన చేస్తున్న ఆలోచన. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యసాధన దిశగా కొనసాగుతున్న ఆయన పనితీరును ప్రజలు గుర్తించాలని ప్రత్తిపాటి కోరారు. సంజీవని పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ లభిస్తుందన్నారు. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాకుప్పలో అమలుచేసి సత్ఫలితాలు సాధించారని, త్వరలోనే రాష్ట్రమంతా అమల్లో పెట్టనున్నట్టు మాజీమంత్రి పేర్కొన్నారు.

ప్రజల నుంచి వినతులు స్వీకరణ
సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులు అందించిన అనంతరం.. తనను కలిసేందుకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రత్తిపాటి..వారి విజ్ఞప్తులు పరిశీలించి, సమస్యల్ని అధికారులకు తెలియచేశారు. వారంలో సమస్యలు పరిష్కారం కావాలని, అర్జీదారులతో నేరుగా తానే మాట్లాడతానని ప్రత్తిపాటి అధికారులకు స్పష్టం చేశారు. రోడ్లు..డ్రైనేజ్ లనిర్మాణం.. పింఛన్లకు సంబంధించిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రత్తిపాటి యంత్రాంగానికి సూచించారు.

కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, టీడీపీ నాయకులు తేళ్ల సుబ్బారావు, అంబటి సోంబాబు , కోడె హనుమంతరావు , మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top