జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి
బిజెపి జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ
సాక్షితవనపర్తి ఆగస్టు 2
బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ అధ్యక్షతన శని వారం ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షులు డి.నారాయణ మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్ర రావు ఆదేశం మేరకు మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా ఆగస్టు 3, 4 తేదీలలో ఇంటింటికి బిజెపి ఇంటింటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు యోజనలో భాగంగా పోలింగ్ బూతు పరిధిలోని ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు కమిటీ సభ్యులు వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ అభివృద్ధి లక్ష్యాలు మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలు సాధించిన ప్రగతిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అదే సమయంలో ఉత్తుత్తి గ్యారెంటీలు, ఉద్దెర హామీలతో అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేని అసమర్ధ దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలముందుంచాలని గ్రామాలలో వార్డు మెంబర్లు సర్పంచుల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తయి 18 నెలలైన స్థానిక ఎన్నికలు నిర్వహించే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని స్పెషల్ ఆఫీసర్లు, కార్యదర్శుల పాలనతో గ్రామాలు పూర్తిగా అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయని స్థ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసే అవకాశం లేదని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యానికి ఫోర్ పిల్లర్స్ (నాలుగు స్తంభాలుగా) శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయవ్యవస్థలతో సమానంగ మీడియా వ్యవస్థను ఫోర్త్ పిల్లర్ గా అభివర్ణిస్తారని ఫోర్ పిల్లర్స్ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తూ పౌరుల హక్కులను కాపాడుతాయని అలాంటి ముఖ్యమైన ఫోర్త్ పిల్లర్ మీడియా రంగాన్ని చులకనగా చూస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓనమాలు రానోడు ఏబిసిడిలు రానోడు ఎవడు పడితే వాడు జర్నలిస్ట్ రాసుకోవడం వాళ్ళ తాత జాగీర్ కాదని చెంప చెల్లుమనేలా కొడతానని వ్యాఖ్యానించడం ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవాకులు చేవాకులు పేలిన రేవంత్ రెడ్డికి ఈ ఓనమాలు రాని జర్నలిస్టులే మద్దతుగా నిలిచారనే విషయాన్ని మరిచిపోవద్దని 20 నెలలైనా హామీలను అమలు చేయకుండా ఢిల్లీ నుండి రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అసమర్థ దద్దమ్మ ముఖ్యమంత్రి పాలనా వైఫల్యాలను ఎత్తిచూపడంతో అభద్రతాభావంతో ప్రభుత్వ ఉద్యోగులను,మీడియా రంగాన్ని కించపరచడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తుందని దశాబ్దాలుగా నీతి నిజాయితీతో అర కొర సంపాదనతో ప్రలోభాలకు లోను కాకుండా భయం బెదురు లేకుండా జర్నలిస్టులు పనిచేస్తుంటారని ఏ వ్యవస్థలోనైనా ఒకరిద్దరు అక్రమ మార్గం పడితే ఆ వ్యవస్థను పూర్తిగా ద్వేషించడం దూషించడం తగదని వెంటనే జర్నలిస్టులకు బేషరతు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో జర్నలిస్టులకు మద్దతుగా బిజెపి వనపర్తి జిల్లా కమిటీ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తుందని హెచ్చరించారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామన్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి బిజెపి జిల్లా మీడియా ఇన్చార్జ్ పెద్దిరాజు వెంకటేష్ నాయుడు బొడ్డుపల్లి వెంకటేష్ సుగురూ రాములు ఆగ పోగు కుమార్ బిజెపి పట్టణ అధ్యక్షుడు ఏ రాజశేఖర్ గౌడ్ పట్టణ ప్రధాన కార్యదర్శలు దంతజు నవీన్ నల్లవతుల అరవింద్ రాయన్న సాగర్ ఉండే కోటి అంజి ఉపేందర్ యాదవ్ కూ న శ్రీకాంత్ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు ఎన్ రవికుమార్ పడమంచి శివ చంద్రశేఖర్ విజయసాగర్ యువమోర్చా పట్టణ అధ్యక్షుడు మండల రాజు ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు చాణిక్య తదితరులు పాల్గొన్నారు
