ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండలంలోని బాలెంలలో ఎన్.డి.సి.ఎమ్.ఎస్ ఆధ్వర్యంలో ఉప్పుల సందీప్ యాదవ్ ఏర్పాటు చేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఏఐసీసీ సభ్యులు, సూర్యాపేట కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్ రెడ్డి సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను, దళారులను నమ్మి అమ్మవద్దని కోరారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలన్నారు. ధాన్యంలో తేమశాతం 17కి మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాలు మట్టి లేకుండా ఉండే విధంగా చూడాలన్నారు.వారితో పాటు ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి, బాలెంల గ్రామ కార్యదర్శి, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచ్ రామసాని రమేష్ నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్ నాయుడు, బాలెంల బి ఆర్ ఎస్ నాయకులు మామిడి తిరుమలయ్య, ఐకేపీ సహా నిర్వాహకులు గాలి నాగరాజు, బాలెంల గౌడ సంఘం అధ్యక్షులు గుణగంటి భద్రయ్య, తాడూరి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
