రైల్వే–సింగరేణి క్రికెట్ టోర్నమెంట్‌లో రైల్వే జట్టు విజయం….
సాక్షిత న్యూస్ పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, గోదావరిఖని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రైల్వే–సింగరేణి సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు జట్లతో క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. క్రీడాస్ఫూర్తిని చాటుతూ జరిగిన ఈ పోటీలు క్రీడాభిమానులను ఆకట్టుకున్నాయి.
టోర్నమెంట్‌లో జీడీకే–11 గ్రూప్, జీడీకే–1 గ్రూప్, సింగరేణి జట్టు, రైల్వే జట్లు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో రైల్వే జట్టు విజేతగా నిలవగా, సింగరేణి జీడీకే–1 జట్టు రన్నరప్‌గా నిలిచింది.
విజేతలు, రన్నరప్ జట్లకు ఆర్‌జీ–1 ప్రధాన మహాప్రబంధకుడు లలిత్ కుమార్, 11ఏ గ్రూప్ ఏజెంట్ చిలక శ్రీనివాస్, రైల్వే ఐఆర్‌ఎస్ అధికారి శుభం పట్టుసరియా, సిబ్బంది అధికారి హనుమంతరావు, ఎఐటీయూసీ శాఖ కార్యదర్శి రంగు శ్రీనివాస్ ట్రోఫీలు, బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధాన మహాప్రబంధకుడు లలిత్ కుమార్ మాట్లాడుతూ పోటీల్లో పాల్గొన్న అన్ని జట్ల క్రీడాకారులను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించాలని, సంస్థ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ టోర్నమెంట్ క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు రైల్వే–సింగరేణి ఉద్యోగుల మధ్య స్నేహభావాన్ని మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు మల్లికార్జున్, జాన్ కెనడి, రాజ్‌కుమార్, హరికృష్ణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
