పల్ హోటల్ పై దాడి 19 గృహ సిలిండర్లను పట్టుకున్న….. జిల్లా సివిల్ సప్లై బృందం

Sakshitha news

పల్ హోటల్ పై దాడి 19 గృహ సిలిండర్లను పట్టుకున్న….. జిల్లా సివిల్ సప్లై బృందం

గృహ సిలిండర్ లను వాణిజ్యం కోసం వాడితే కఠిన చర్యలు తప్పవు… డీఎస్ఓ కాశీ విశ్వనాథ్ హెచ్చరిక

సాక్షిత వనపర్తి :
గృహ( డొమెస్టిక్) సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం చట్ట విరుద్ధమని, ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్ హెచ్చరించారు.

వనపర్తి పట్టణంలోని పలు హోటళ్లలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథ్ తమ బృందంతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్లలో గృహ వినియోగానికి ఉద్దేశించిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.

తనిఖీలలో భాగంగా మొత్తం 19 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

గృహ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారి హెచ్చరించారు.

హోటల్ యజమానులు తప్పనిసరిగా వాణిజ్య సిలిండర్లను మాత్రమే ఉపయోగించాలని సూచిస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు కట్టుబడి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

Scroll to Top