గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందిన 52 లక్షల కుటుంబాల తరపున ప్రజా పాలన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ యువ నాయకులు నర్సారెడ్డి తేజ రెడ్డి (NTR).
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చి తెలంగాణ ఆడబిడ్డలకు గృహ జ్యోతి పథకం ద్వారా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 295 బౌరంపేట్ డివిజన్ లో లబ్ధి పొందిన వారికి ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రీటింగ్స్ అందజేసిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ యువ నాయకులు నర్సారెడ్డి తేజ రెడ్డి(NTR) .
ఈ సందర్భంగా నర్సారెడ్డి తేజ రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలకు మరియు వివిధ కుల వృత్తుల వారికి కరెంటు చార్జీలో భారీగా రాయితీలు ఇస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో గృహజ్యోతి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గణేష్ మండపాలకు ఉచిత కరెంట్, కుల వృత్తి దుకాణదారులకి మరియు వివిధ పథకాల కింద 84.36 లక్షల మందికి గత ఏడాది 15,946 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించిందని గుర్తుచేశారు.
వ్యవసాయ ఉచిత విద్యుత్ కి 29,23,559 కనెక్షన్లకు గాను13,499 కోట్లు.
గృహ జ్యోతి పథకానికిగాను 52,82,498 లబ్ధిదారులకు 2,086 కోట్లు.
పాఠశాలలకు 142 కోట్లు.
లాండ్రీ షాప్స్ ద్వారా 70,732 లబ్ధిదారులకుగాను 71 కోట్లు.
రాష్ట్రంలో వినాయక చవితి సందర్భంగా 88,907 గణేష్ మండపాలకు గాను 32.50 కోట్లు.
క్షౌరశాలలు (Hair Cutting Shops) 34,030 లబ్ధిదారులకుగాను 25 కోట్లు,
మరియు వివిధ కుల వృత్తుల వారు లబ్ధి పొందుతున్నారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ మిద్దిల యాదిరెడ్డి, విద్యుత్ అధికారులు DE శ్రీనివాస్ గౌడ్, ADE ప్రేమ్ కుమార్, AE సాయి కిరణ్, లైన్మెన్ శివకుమార్ సీనియర్ నాయకులు నర్సారెడ్డి బాల్ రెడ్డి, ఆర్కెల విజయ్ గౌడ్, జిల్లా ఫిషర్మెన్ అధ్యక్షుడు పోచి మహేష్, దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతకింది సురేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ బి.చిరంజీవి, ఆంజనేయ వర్మ, జిత్తయ్య మరికొందరు నాయకులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
