మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షణ కార్యక్రమం ఏర్పాటు….
నగరంలోని బిఆర్ఎస్ భవన్ వేదికగా కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేసేందుకు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ చేసిన కృషిని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు వివరించగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమెల్సీ శంభీపూర్ రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ , ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీధర్ హాజరై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ….
గత పాలకుల హయాంలో అడుగడుగునా నిర్లక్ష్యానికి గురై పాలకుల అసమర్ధ పాలనతో, తెలంగాణపై ఉన్న వివక్షతతో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక బీడుబారిన తెలంగాణ ప్రాంతాన్ని మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా సస్యశ్యామలం చేసిన అపర భగీరధుడు, తెలంగాణ దార్శనికులు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల కాలంలో తన బృహత్తర ప్రణాళికలతో కాలేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుతో రైతన్న కళ్ళల్లో ఆనందం నింపి, నాడు దండగగా ఉన్న వ్యవసాయ రంగాన్ని పండుగగా మార్చిన గొప్ప నేత కెసిఆర్ .
కాలేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుతో తెలంగాణను సస్యశ్యామలం చేసి దేశంలోనే అత్యధిక దిగుబడి నిచ్చే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన కెసిఆర్ పై అవినీతి మరక అంటించేందుకు ఈ స్కాంగ్రెస్ ప్రభుత్వం కుటిలయత్నాలు చేస్తుందని, దీనిని ప్రజలంతా గమనిస్తున్నారని, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రగతిని కుంటుపరచిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
పెద్దలు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో నాడు కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఆవశ్యకత, ఇంత భారీ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగానికి కలిగిన లబ్ధిని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కాలేశ్వరం పేరుతో చేస్తున్న అసంబద్ధ ఆరోపణలను నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలకు వివరించాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి బిఆర్ఎస్ పార్టీయే రక్ష అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల సభ్యులు, నాయకులు, అభిమానులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
