పీకే రామయ్య కాలనీ అంగన్వాడి టీచర్ సరిత ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం

Sakshitha news

పీకే రామయ్య కాలనీ అంగన్వాడి టీచర్ సరిత ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం తో పాటు అన్నప్రాసం, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం….

సాక్షిత పెద్దపల్లి : . రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఒకటవ డివిజన్ పీకే రామయ్య కాలనీ లోని అంగన్వాడి సెంటర్ లో అంగన్వాడీ టీచర్ సరిత ఆధ్వర్యంలో.. చిన్నారులకు అక్షరాభ్యాసం తో పాటు అన్నప్రశం, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా నూతనంగా ఎన్నుకోబడిన ఒకటవ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ- మల్లేష్ పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసంతో పాటు అన్నప్రశం చేయడం జరిగింది.

అనంతరం మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ.. ఒకటవ డివిజన్ కార్పొరేటర్ గా ఏకగ్రీవం కావడానికి డివిజన్ ప్రజల ప్రతి ఒక్కరి ఆశీర్వాదంతో ఈరోజు కార్పొరేటర్ గా గెలవడం జరిగిందని, ఈ సందర్భంగా ఒకటో డివిజన్ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నానని మల్లేష్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంగన్వాడి సెంటర్ ద్వారా చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికరమైన ఆహారం అందిస్తూ పేద ప్రజలకు ఎంతోగానో ఉపయోగ పడుతుందని, ఈ యొక్క అంగన్వాడి నిర్వహిస్తున్న టీచర్ లు, సిబ్బంది ఎంతో ప్రతిష్టమైన సేవలందిస్తూ, ప్రతి ఒక్కరి పేదవారికి ప్రభుత్వం నుంచి వచ్చే పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రజలందరి మన్ననలు పొందుతున్నారని ఈ సందర్భంగా మల్లేష్ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ సోషల్ మీడియా ఇన్ఛార్జి గుర్రాల మల్లేష్ యాదవ్, పీకే రామయ్య కాలనీ ఆర్పి గీద రాణి,పాల్గొన్నారు.

Scroll to Top