292 డివిజన్ మరాఠీ బస్తీ, సిద్ధార్థ నగర్ లో UGD సమస్యకు శాశ్వత పరిష్కారం

Sakshitha news

292 డివిజన్ మరాఠీ బస్తీ, సిద్ధార్థ నగర్ లో UGD సమస్యకు శాశ్వత పరిష్కారం – ప్రజల నుండి హర్షం


కుత్బుల్లాపూర్,

292 డివిజన్ పరిధిలోని సాయిబాబా నగర్, మరాఠీ బస్తీ, సిద్ధార్థ నగర్ ప్రాంతాల్లో గత కొంతకాలంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) సమస్య పరిష్కారానికి BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ చొరవ తీసుకున్నారు.

స్థానికులు తమ సమస్యను వారాల వినోద్ కుమార్ దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే K.P. వివేకానంద గౌడ్ దగ్గరకు వెళ్లి సమస్యను వివరించారు. MLA స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా మరాఠీ బస్తీ అధ్యక్షులు అశోక్ మరియు బస్తీ వాసులు వారాల వినోద్ కుమార్ కి, MLA వివేకానంద కి కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. చిరకాల సమస్య పరిష్కారమైనందుకు స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ ముదిరాజ్ మరియు స్థానిక BRS నాయకులు పాల్గొన్నారు