జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,
- ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా నియామకం పత్రం అందుకున్న వజ్రెష్ యాదవ్
:మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. ఈ మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన తోటకూర వజ్రెష్ యాదవ్ కు మంగళవారం నియామకం పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ లు మాట్లాడుతూ రాబోయే గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా ఇప్పటి నుండే పార్టీని బుత్ స్థాయి నుండి బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు.
అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయేలా కార్యకర్తలను సమాయత్తం చేయాలని తెలిపారు. అనంతరం వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పార్టీని జిల్లాలో బలమైన శక్తిగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గే,పార్లమెంటరి నాయకుడు రాహుల్ గాంధీ,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
