పాతపట్నం నియోజకవర్గం ఎల్.యన్.పేట మండలం సొసైటీ పాలక కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ …
▪️ పాతపట్నం నియోజకవర్గం ఎల్,యన్.పేట మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ పాలక కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సొసైటీ చైర్మన్ గా కాగాన మన్మదారావు , డైరెక్టర్లుగా యరబాటి రాంబాబుగారు,కొయ్యాన శ్రీను బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షల మేరకు రైతుల శ్రేయస్సు ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అధికారులు,రైతు సంఘ నాయకులు,నీటి సంఘ నాయకులు,ఎన్డీఏ కూటమి నాయకులు,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
