పాండేశ్వర్ రెడ్డి అకాల మరణం దురదృష్టకరం

Sakshitha news

పాండేశ్వర్ రెడ్డి అకాల మరణం దురదృష్టకరం

కాంటినెంటల్ హాస్పిటల్ లో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

సాక్షిత వనపర్తి
వనపర్తి నియోజకవర్గం లోనిపెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి భర్త కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాండేశ్వరి రెడ్డి మృతి చెందడం దురదృష్టకరమని వనపర్తి శాసనసభ్యులుతూడి మేఘారెడ్డి పేర్కొన్నారు

అనారోగ్యంతో హైదరాబాద్ నానక్ రామ్ గూడ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 11:30 గంటలకు మృతి చెందడం విషాదకరమని ఆయన అన్నారు

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరుకొని కుమారుడు యుగంధర్ రెడ్డి తో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు

ఈ పరామర్శలో ఖిల్లా ఘణపురం మండల నాయకులు సాయి చరణ్ రెడ్డి, రంగాపురం రామచంద్రారెడ్డి, మణిగిల్ల తిరుపతిరెడ్డి, తదితరులు ఉన్నారు

Scroll to Top