పంచాయతీ రాజ్ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో భాగస్వాములు కండి.. ఎమ్మెల్యే అమిలినేని

Sakshitha news

పంచాయతీ రాజ్ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో భాగస్వాములు కండి.. ఎమ్మెల్యే అమిలినేని

పదహారునెలల్లో ఏకంగా పంచాయతీలకు 1200 కోట్లు నిధులు ఇచ్చిన కూటమి ప్రభుత్వం

ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్లు లేక ఉన్న పంచాయతీ రాజ్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వంలో ప్రమోషన్లు

పంచాయతీ రాజ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి పాలాభిషేకం

పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా మౌళిక వసతులను కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిపై ప్రత్యేక ద్రుష్టి సారించి అభివృద్దే ద్యేయంగా ముందుకు వెళుతున్న కూటమి ప్రభుత్వానికి పంచాయతీ రాజ్ ఉద్యోగులు భాగస్వాములై అభివృద్ధికి బాటలు వేయాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. నేడు ప్రజావేదికలో నియోజకవర్గంలోని పంచాయతీ రాజ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు పంచాయతీ రాజ్ ఉద్యోగులు కేవలం పింఛన్లు పంపిణీకి మాత్రమే పనిచేశారని, అందులో కూడా వారికి ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్లు కూడా కల్పించలేదని కూటమి ప్రభుత్వం వారి ఇబ్బందులు గమనించి వారికి ప్రమోషన్లు ఇచ్చారని, పంచాయతీ కార్యదర్శులను కూడా ఇక ముందు పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా మార్పు చేశారని, గత ప్రభుత్వంలో ఐదేళ్లు కేవలం 200 కోట్లు నిధులు ఇస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లోనే 1200 కోట్లు కేటాయించి పంచాయతీల అభివృద్దకి బాటలు వేశారని తెలిపారు.. పంచాయతీలలో కొందరు అనవసరంగా మోటార్లు పదే పదే రిపేర్ల పేరుతో డబ్బులు వృధా చేస్తున్నారని అలాంటివి మానుకుని కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు..