పద్మశాలి సేవా సంఘం నూతన సంవత్సర కాలెండర్ ను ఆవిష్కరించిన.ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి..
సాక్షిత ప్రతినిధి ) కోదాడ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గొర్రె రాజేష్ ఆధ్వర్యంలో పద్మశాలి సేవా సంఘం నూతన సంవత్సర కాలెండర్ ను కోదాడ శాసన సభ్యులు శ్రీమతి నలమాద ఉత్తమ్ పద్మావతి చేతుల మీదగా శనివారం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భముగా పద్మశాలీయులందరూ ఐకమత్యంగా ఉండి సమస్యలను సాదించుకోవాలన్నారు. చేనేత కార్మికుల అభివృద్దికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంగిశెట్టి గోపాల్, తెలంగాణ రాష్ట్ర అఖిలభారత నిత్య అన్నదాన సత్రం అధ్యక్షుడు చిన్నం వీరమల్లు, నియోజకవర్గ పద్మశాలీ అధ్యక్షుడు కొంగర నరసింహారావు, సూర్యాపేట జిల్లా పద్మశాలీ సంఘం ఉపాధ్యక్షుడు నక్క చంద్రం, కోదాడ పట్టణ పద్మశాలీ సంఘం ఉపాధ్యక్షుడు పెండిప్రోలు శ్రీనివాస్ , పద్మశాలీ సంఘం మాజీ అధ్యక్షుడు పెంటి రామారావు, కోదాడ పద్మశాలి సంఘం కోశాధికారి చిట్టిప్రోలు గిరిప్రసాద్, కోదాడ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు పంతంగి నరేష్ కోదాడ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ దేవరశెట్టి సైదులు, నక్కా గోపి, బుద్ధారపు శేషగిరిరావు మరియు కోదాడ మహిళ కమిటీ అధ్యక్షురాలు కొంగరి మాధవి కోదాడ ప్రధాన కార్యదర్శి చిట్టిప్రోలు దుర్గ భవాని కోదాడ కోశాధికారి రుద్ర నాగాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమములో
పద్మశాలి కుల బంధువులు సురేష్ సంపత్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
