వేసవి రోజుల్లో ఎద్దాడిని నివారించాలి : పద్మారావు గౌడ్ ఆదేశాలు
సికింద్రాబాద్ : రానున్న వేసవి రోజుల్లో కూడా సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోనీటి ఎద్దడి ఎదురుకాకుండా అన్నీ చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆయన సికింద్రాబాద్ ఎం. ఎల్. ఏ . క్యాంపు కార్యాలయంలో జల మండలి జనరల్ మేనేజర్ వినోద్ కుమార్, ఇతర అధికారులతో సమావేశమై, వేసవి కార్యాచరణ ప్రణాళికా పై సూచనలు చేశారు. రోజు జరిగే నీటి సరఫరా అన్నీ రిజర్వేయర్లకు సాఫీ గా సాగేలా జాగ్రత్త పడాలని, అన్నీ మున్సిపల్ డివిజన్ల పరిధుల్లో నీటి ఎద్దడి ఎదురు కాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా కోరారు.
పవర్ బోర్ ల మరమ్మతులు పూర్తి చేయాలిని, కనెక్షన్ ల ప్రక్రియను పూర్తి చేసి అన్నీ పవర్ బోర్ లు వాడకంలోకి తేవాలని ఆదేశించారు. ట్యాంకర్ లను అందు బాటులో ఉంచాలని, OU camps లో సరఫరా సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. సివారేజీ సమస్యలు అధికంగా ఉన్నాయని, పూడిక తీసిన వెంటనే తొలగించడం లేదని తెలిపారు. కొత్తగా మున్సిపల్ డివిజన్ల విభజన కు అనుగుణంగా సిబ్బందికి ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఆయా అంశాల పై సానుకూలంగా ఉన్నట్లు జీ. ఏం. వినోద్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
