ఎన్‌టిపిసి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) కార్యాలయం కొరకై వినతి….
సాక్షిత పెద్దపల్లి//ఎన్టిపిసి జ్యోతినగర్: జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ ను ఎన్టీపీసీ అతిథి గృహంలో, ఎన్‌టిపిసి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) కార్యాలయ వసతి కోసం ఎన్‌టిపిసి సంస్థ వారి నుండి కార్యాలయాన్ని ఇప్పించుట కొరకు మెమొరాండం సమర్పించుట జరిగింది.
అనేక సంవత్సరాలుగా ఎన్టీపీసీలో ఉద్యోగం చేసి ఇక్కడి ప్రాంత అనుబంధంతో ఉద్యోగ విరమణ అనంతరం ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. వైద్యం, పెన్షన్ ఇతర పనుల నిమిత్తం విశ్రాంత ఉద్యోగులు తరుచుగా రావడం, రేవా కార్యాలయం లో వసతి లేక అనేక ఇబ్బందులకు గురి అగుచున్నారు. రేవా కార్యాలయం వసతి , విశ్రాంతి రూమ్ లో రేవా సభ్యులు కలసి
సంభాషణలు, వార్తాపత్రికలు, పుస్తకాలు చదవడం, క్యారమ్, చెస్ వంటి ఇండోర్ ఆటలు ఆడటం అవసరం, ఇందుకొరకు రేవా కు కార్యాలయ వసతి ఇప్పించుటకు రామచందర్ సహకారం కోరటం జరిగింది.
ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆకుల రాoకిషన్, కార్యదర్శి చెప్యాల శ్రీపతి రావు ఆధ్వర్యములో జరిగిన ఈ కార్యక్రమంలో
రేవా సీనియర్ నాయకులు తిరుమల సురేందర్, దుర్గం నర్సయ్య , మంగళంపల్లి రామ్ నారాయణ , డి ఎన్ పోచయ్య, డి లాలయ్య , కొమ్ము గోపాల్, సాంబ మూర్తి, ఇతరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY