శ్రీ హరి హర క్షేత్ర దేవస్థానంలో నూతన పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన కూకట్పల్లి టి పి సి సి వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్
కూకట్పల్లి మూసాపేట భరత్‌నగర్ కాలనీలోని శ్రీ హరి హర క్షేత్ర దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాలకమండలి సభ్యులు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ & కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా బండి రమేష్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బండి రమేష్ మాట్లాడుతూ, దేవాలయాల అభివృద్ధి మరియు సంస్కృతి పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యాల కోసం అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నూతన
పాలక మండలి సభ్యులుగా సూర్యనారాయణమూర్తి, బిక్షపతి గౌడ్, సత్యనారాయణ, నాగేంద్రబాబు, వెంకటపతి రాజు, మణెమ్మ తదితరులు బాధ్యతలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పన, పారదర్శక పరిపాలన కొనసాగించడం తమ ప్రధాన లక్ష్యమని సభ్యులు వెల్లడించారు. ఈ
కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు పి. నాగిరెడ్డి మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు మధుసూదనరావు, చెన్న కేశవులు, వెంకట్ యాదవ్, వెంకటేశ్వర్లు, హనుమంత్ రావు, రామకృష్ణ, రాజు, రవి, అప్నా బజార్ నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
