బాచుపల్లి పరిధిలోని సాయి నగర్,* TSWR స్కూల్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫర్ గర్ల్స్* సమీపంలో* ఏర్పడిన డంపింగ్ యార్డ్ వల్ల స్థానిక ప్రజలు మరియు విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టేట్, మైనారిటీ, బీసీ మరియు సంక్షేమ శాఖల మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు
ఈరోజే సంబంధిత స్థలాన్ని సందర్శించి, పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు.* ప్రజారోగ్యం మరియు పరిసరాల పరిశుభ్రతను* దృష్టిలో ఉంచుకుని డంపింగ్ యార్డ్‌ను పూర్తిగా శుభ్రపరిచి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన ఈ సందర్భంగా స్థానికులకు హామీ ఇచ్చారు.
ఈ పర్యటన సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి * *తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టేట్, మైనారిటీ, బీసీ మరియు సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఇద్దరూ కలిసి డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడి పరిస్థితులు, దుర్గంధం, దోమల సమస్యతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య ఇబ్బందులపై చర్చించారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థినులు మరియు పరిసర కాలనీల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అతి త్వరలోనే ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని హన్మంత్ రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మనుచౌదరీ గారు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలను సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరిస్తున్నారనే సందేశాన్ని ఈ కార్యక్రమం మరోసారి స్పష్టం చేసింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
