అభివృద్ధి, సంక్షేమమే మోడీ ప్రభుత్వ లక్ష్యం…
దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన నాయకత్వం….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశీపేట శివాజీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాశీపేట శివాజీ, జిల్లా కార్యదర్శి సోమారపు లావణ్య మాట్లాడుతూ, అవినీతికి తావు లేకుండా అభివృద్ధే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అట్టడుగు వర్గాల సంక్షేమం నుంచి ఆత్మనిర్భర్ భారత్ కింద ఉపగ్రహాల తయారీ వరకు దేశాన్ని ప్రపంచం ముందు తలెత్తుకునే స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు.
ఎస్సీ వర్గాల ఆర్థిక సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, సామాజిక న్యాయం, గౌరవాన్ని అట్టడుగు వర్గాలకు అందించారని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల నిరుపేదలకు ప్రతి నెల ఉచిత బియ్యం అందిస్తున్నారని పేర్కొన్నారు.
స్కిల్ ఇండియా ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, స్వచ్ఛ భారత్ మరియు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామపంచాయతీలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో గుండు పిన్ను నుంచి ఉపగ్రహాల వరకు స్వదేశీ తయారీకి ప్రాధాన్యత ఇచ్చి దేశాన్ని స్వాభిమాన భారత్‌గా తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోడీదేనని అన్నారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధిలో రైల్వే స్టేషన్ అభివృద్ధి, ఎన్టీపీసీ నాలుగో యూనిట్, ఎఫ్‌సీఐ అభివృద్ధి వంటి కార్యక్రమాలు మోడీ ప్రభుత్వ కృషి ఫలితమని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, తెలంగాణలో వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశీపేట శివాజీ, జిల్లా కార్యదర్శి సోమారపు లావణ్య, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ, మాజీ జిల్లా కార్యదర్శి జక్కుల నరహరి, సీనియర్ నాయకులు సులువ లక్ష్మీ నరసయ్య, సిరిశెట్టి మల్లేష్, మండల అధ్యక్షులు అయిత పవన్, మిట్టపల్లి సతీష్, బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవ్ కుమార్, అందె రాజకుమార్, జనగామ శివరామకృష్ణ, కుమ్మరి మల్లేష్, సాయి ప్రదీప్, ప్రవీణ్ గౌడ్, సప్ప నాగరాజు, బుంగ మహేష్, అరిగల శ్రావణ్, కాంపెల్లి రఘు, చుక్కల రాములు, సిలివేరి అంజి, పాశం రాజు, చల్ల శోభారాణి, పంగ రవి, వెలుతురు రాజయ్య, కొటె నరేష్, మేరుగు శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

