చిన్నం చెరువు అలుగు నాలా సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం : ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

Sakshitha news

చిన్నం చెరువు అలుగు నాలా సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం : ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే …

సాక్షిత : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) దుండిగల్ సర్కిల్ పరిధి బౌరంపేట్ డివిజన్ పరిధిలోని మల్లంపేట్ చిన్నం చెరువు అలుగు నాలా సమస్యను పరిష్కరించేందుకు దాదాపు 9.80 కోట్ల రూపాయలతో నూతనంగా చేపట్టనున్న నాలా నిర్మాణ పనులతో తలెత్తనున్న సమస్యలను స్థానికులు స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ దృష్టికి తీసుకురాగా ఈరోజు ఉదయం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ వివిధ విభాగాల అధికారులతో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ వరద నీటితో ముంపుకు గురవుతున్న కాలనీల ముంపు సమస్య – పరిష్కారంలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….

వరద నీటితో ముంపుకు గురవుతున్న ప్రాంతాల్లో తీవ్రతను తగ్గించే దిశగా చర్యలు చేపట్టి వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రజా ప్రయోజనాలే తమ ప్రాధాన్యతనని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

ప్రతిపాదిత నాలా నిర్మాణం వల్ల ఎక్కువగా ఆస్తినష్టం జరిగే పరిస్థితి ఉన్నందున గ్రామం శివారు నుంచి కాకుండా పూర్వపు నాలా ద్వారానే నీటి ప్రవాహ దిశకు అనుగుణంగానే కాలువ నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలన్నారు.

గ్రామస్తుల ఆందోళన మాకు తెలుసని ఈ సమస్యను ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను అందరి ఆమోదంతో పరిష్కరిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ లేక్స్, ఇరిగేషన్, మున్సిపల్, హైడ్రా విభాగాలకు చెందిన పలువురు అధికారులు, ప్యాక్స్ చైర్మన్ మిద్దల బాల్ రెడ్డి, నిజాంపేట్ మాజీ కార్పొరేటర్ రవికిరణ్, మాజీ కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, మాదాసు వెంకటేశం, అర్కల అనంతస్వామి, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శామీర్ పేట హన్మంత్ రావు, ఎంబరి ఆంజనేయులు, విష్ణువర్ధన్ రెడ్డి, నాచారం మురళీ యాదవ్, శంకర్ నాయక్, మరియు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, పలు కాలనీల వాసులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top