వీబీ-జీ రామ్‌జీ ఉపాధి హామీ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.

Sakshitha news

వీబీ-జీ రామ్‌జీ ఉపాధి హామీ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రూ.14 లక్షల కోట్ల నిధులు.

గ్రామీణ పేదలకు ఏడాదికి 125 రోజుల ఉపాధి.

గ్రామీణ పేద కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, ఆదాయ భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్–గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్–గ్రామీణ్ (వీబీ-జీ రామ్‌జీ)’ పథకం రూపొందించిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. రామన్నపాళెం పంచాయతీలో వీబీజీరామ్‌జీప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు.ఎన్నో ఆర్థిక సమస్యలతో ఉన్న రాష్ట్రాన్ని ప్రజలు కూటమి ప్రభుత్వానికిఅప్పగించారని,అయినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండేళ్లలోనే ఎన్నికల హామీలలో అత్యధిక భాగాన్ని అమలు చేశారనిపేర్కొన్నారు.రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవాల్సిన మనకు కొత్త దిశను చూపిన నాయకుడు చంద్రబాబుని కొనియాడారు.

ఇందుకు ప్రధాని మోదీ గారు గొప్ప సహకారం అందించారని తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్‌ ప్రభుత్వం ఉండటం వల్ల గత రెండేళ్లలో కేంద్రం నుంచి రూ.14 లక్షల కోట్ల విలువైన నిధులు రాష్ట్రానికి లభించాయని తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ప్రశాంతి రెడ్డి అన్నారు.కేంద్ర ప్రభుత్వం వీబీ-జీ రామ్‌జీ పథకం అధికారిక జాతీయ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసిందనిపేర్కొన్నారు.తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి గ్రామంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు.

గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచడం, గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి భద్రత కల్పించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వివరించారు.వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా పంట నాట్లు, కోత సమయంలో 60 రోజుల పని విరామం కల్పించడంతో పాటు, గ్రామీణ పేదలకు ఏడాదికి 125 రోజుల ఉపాధి కల్పించేలా ఈ పథకాన్ని రూపొందించారని తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లో కార్మికులకు రోజువారీ కూలీని రూ.312గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, గతంతో పోలిస్తే రూ.5 పెంపు చేసినట్లు తెలిపారు. కొత్త గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ కార్డులు జారీ అయ్యే వరకు ప్రస్తుతం ఉన్న ఈ-కేవైసీ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్ కార్డులే చెల్లుబాటవుతాయని స్పష్టం చేశారు.జాబ్ కార్డులు లేని కార్మికులు గ్రామ పంచాయతీలో నమోదు చేసుకుంటే సరిపోతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల అధ్యక్షుడు నాపావెంకటేశ్వర్లు నాయుడు కోటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top