వరంగల్ జిల్లా దిశా కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు ..
మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ అధ్యక్షతన వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొనసాగుతున్న వరంగల్ జిల్లా ‘దిశా’ (జిల్లా అభివృద్ధి సహకార మరియు మానిటరింగ్ కమిటీ) సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:-…
జిల్లాలో అక్షయ పాత్ర సేవలు విధ్యార్థులకు ఆరోగ్యవతమైన బోజనాన్ని అందిస్తున్నదని, ఆ సేవలు వరంగల్ అర్బన్ మునిసిపాయిటీ లోనే కాకుండా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14, 43 డివిజన్లలో అక్షయపాత్ర సేవలను విస్తరించాలని కోరారు.
పిల్లలు చదువుతో పాటు స్పోర్ట్ లో పట్టు ఉండాలని , అందుకు గాను జిల్లాలో స్పోర్ట్ స్పాషల్ అధికారిని నియమించి మండలాల వారిగా మోనిటరింగ్ ఉండేలా చూడాలని వారు పేర్కొన్నారు ప్రతి మండలంలో క్రీడా సామగ్రి పంపిణీ మరియు పర్యవేక్షణ కోసం స్పోర్ట్స్ ఆఫీసర్లను నియమించడం తప్పనిసరి అని వారు పేర్కొన్నారు. పాఠశాల లో మౌలిక సదుపాయాల సమస్యలను కూడా తమ దృష్టికి తీసుకురావాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని,దానికి తగినట్లు గా ప్రభుత్వ పాటశాలలో పిల్లల హాజరు శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని వారు అన్నారు హాస్టల్ విధ్యార్థులకు కిశోర రక్ష హెల్త్ కార్డు జారీలో మంచి ప్రయోజనాలు చేకూరుస్తుందని జిల్లా కలెక్టర్ ని అభినందించారు. ఈ కిశోర రక్షా హెల్త్ కార్డులు మిగతా స్కూల్స్ కి జారీ చేయాలని వారు పేర్కొన్నారు. కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు సిఎస్ఆర్ నిధులను కూడా సరిగా ఉపయోగించుకోవాలని సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. బస్తి దవాఖాన ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి.ఆర్.ఓ విజయలక్ష్మి, డిఆర్డీఓ రామిరెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు…

