జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన శీలం రాజార్షి ని అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే నాగరాజు …
హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన 69వ SGF రాష్ట్రస్థాయి అండర్–19 బాక్సింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించిన వడ్డేపల్లి ఎస్సార్ జూనియర్ కాలేజ్ (ఇంటర్ ఫస్ట్ ఇయర్ MPC) విద్యార్థి శీలం రాజార్షి ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో జరగనున్న జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా హన్మకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ని శీలం రాజార్షి మర్యాదపూర్వకంగా కలిశారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు శీలం రాజార్షికి మెడల్ అందజేసి అభినందనలు తెలియజేస్తూ, జాతీయస్థాయిలో కూడా ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రానికి, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే ఈ విజయానికి తోడ్పడిన కోచ్ శీలం నరేంద్ర దేవ్ ని ప్రత్యేకంగా అభినందించారు…
ఈ కార్యక్రమంలో హసన్పర్తి బ్యాకింగ్ క్యాంప్ నిర్వాహకులు పార్థసారథి , కోచ్ నరేంద్ర దేవ్ తదితరులు పాల్గొన్నారు….

