లింగోద్భవ దర్శనంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్
సాక్షిత ప్రతినిధి – తిరుపతి / శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జాగారం అనంతరం నిర్వహించే “పవిత్ర లింగోద్భవ దర్శనం” వేకువజామున భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, మహాభిషేకాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ సేవలో ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకాళహస్తి ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
అలాగే రాష్ట్రం అభివృద్ధి మార్గంలో దూసుకెళ్లాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత ప్రగతి సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. మహాశివరాత్రి జాగారం అనంతరం జరిగిన లింగోద్భవ దర్శనం సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.

