కలెక్టర్ చేత “మెప్మా” బ్రోచర్ ఆవిష్కరణ
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: మెప్మా లైవ్లీ హుడ్ ప్రమోషన్ సెల్ బ్రోచర్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో ఆవిష్కరించారు. మెప్మా ఆధ్వర్యంలో జీవనోపాదుల ప్రమోషన్ సెల్లో భాగంగా “ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త ” అనే నినాదంతో జీవనోపాధి యూనిట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ చేతుల మీదుగా లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో “మెప్మా” పిడి ఎఫ్రాయిమ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవికుమార్, ఎల్ హెచ్ ప్రమీల, మార్కెటింగ్ నిపుణులు జయరాం పాల్గొన్నారు
