చిలుకూరులో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం.. ఎంఈవో, హెచ్ఎమ్, సర్పంచ్,ఉపాధ్యాయులు….
.సాక్షిత:
చిలుకూరు గ్రామంకు చెందిన ముక్కా చరణ్ సాయి గౌడ్ ఎంసెట్ఇజనీరింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 380 వ ర్యాంక్, జెఈఈ మెయిన్స్ 99.56 ఫర్సంటేజ్ సాధించాడు. అలాగే కొడారు కౌషిక్ సాయి టీజీఆర్ జేసీలో రాష్ట్ర స్థాయి 24వ ర్యాంక్ సాధించాడు. పోటీ పరీక్షలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడంతో వారిని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో చిలుకూరు పీఎంశ్రీ జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. చిలుకూరు మండల నాయకులను రాష్ట్ర స్థాయిలో గుర్తింపుతెచ్చిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారాం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
