సాక్షిత :మహాజన సభా సమావేశం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం
అభివృద్ధి పథంలో సొసైటీ ఎప్పుడు ముందుంటుంది
పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోమహాజన సభ సమావేశం,మెగా రక్తదాన శిబిరం, బయో ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, సేంద్రీయరువులు, అలాగే సంఘం యొక్క ఆడిట్ నివేదిక 2024- 2025, చర్చించడం జరిగింది.మరియు ఖర్చు పొడులు పరిశీలించడం కొండూరు గోవర్ధన్ రెడ్డి సీఈఓ ఆధ్వర్యంలో జరిగాయి. అనంతరం వారు మాట్లాడుతూ పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం ప్రైవేట్ లిమిటెడ్ మహాజన సభ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా దాదాపుగా స్వచ్ఛందంగా యువత ముందుకు వచ్చి 40 నుంచి 50 మంది రక్తం ఇవ్వడం జరిగింది ప్రతి ఆరు నెలలకు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అలాగే బోర్డు సభ్యులు కమిటీతో ఆడిట్ కు సంబంధించి జమ ఖర్చులకు సంబంధించి నివేదిక ఇవ్వడం జరిగింది పడుగు పాడు ప్రాథమిక వ్యవసాయ సంఘం ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి పథంలో ఎప్పుడు ముందుంటుందని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో సీ.ఈఓ. కొండూరు గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి, డైరెక్టర్ నాగిశెట్టి జయప్రకాష్, డైరెక్టర్ నారా శ్రీనివాసులు, సొసైటీ శివ, రెడ్ క్రాస్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
