మేడ్చల్ డీసీసీ కార్యాలయంలో మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన ఓటు చోరి సంతకాల ప్రచార అవగాహన సమావేశంలో పాల్గొన్నా స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పీసీసీ కార్యదర్శులు గజ్జెల కాంతం, మిథున్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జులు బండి రమేష్, పీసీసీ సభ్యులు మహిపాల్ రెడ్డి, భూపతి రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌సీ సెల్ అధ్యక్షులు పత్తి కుమార్, మల్కాజ్గిరి సభ్యులు చంద్రశేఖర్ గార్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ—
ప్రజాస్వామ్యంలో ఓటు ఒక పవిత్ర హక్కు అని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజల ఓటు హక్కును హరించే యత్నాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెలిపారు.
ఓటు చోరీని అరికట్టడంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు, డీసీసీ కమిటీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, GHMC డివిజన్ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI, INTUC ప్రతినిధులు, మైనారిటీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు .

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
