మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వివేకానంద నగర్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలవతో సన్మానించి,అభినదించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మయూరి నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది. అదేవిధంగా మయూరి నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని,కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని , ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి గాని తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని,నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులందరికి ఎల్లవేళాలో అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యల పై స్పందిస్తూ ,ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధి కి పాటుపడాలని ఒక ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దే క్రమం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.జల మయూరి నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని,అసంపూర్తిగా మిగిలిపోయిన పెండింగ్ పనులు త్వరలోనే పూర్తి చేస్తానని, మౌలిక వసతుల కల్పనకై పెద్ద పీట వేస్తానని, కాలనీ అసోసియేషన్ భాగస్వామ్యం తో అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కలిదిండి వెంకట రామరాజు, ఉపాధ్యక్షురాలు బొడ్డు రాధాదేవి,ఉపాధ్యక్షుడు కొండపల్లి హరికృష్ణ ,జనరల్ సెక్రటరీ మండెపూడి కిషోర్ కుమార్,జాయింట్ సెక్రటరీ గజ్జల వెంకట రమణా రెడ్డి,జాయింట్ సెక్రటరీ మూరకొండ గోపాల్ రెడ్డి,కోశాధికారి మొల్లేటి నాగరాజు,కార్యనిర్వాహక సభ్యులు ఎన్.అఖిల,ఎం.వర లక్ష్మి,ఫ్రాన్సిస్ సౌ రెడ్డి యెన్నం,గుమ్మడి వేణు గోపాల్ రావు,కృష్ణ కుమార్ పాటిబండ,గంగిశెట్టి సచిన్ కుమార్ ,కాసుల వెంకట నరసయ్య ,సారెడ్డి అమరనాథ్ రెడ్డి,మహమ్మద్ జానీబాషా షేక్,జి. రఘు రామరాజు,ఎన్ నాగరాజు,NVV కృష్ణ మూర్తి మరియు తదితరులు పాల్గొన్నారు.
