వర్షాకాల ముంపుకు చెక్.. టీచర్స్ కాలనీలో వరద కాలువ పనులకు మేయర్ మహంకాళి స్వామి గ్రీన్ సిగ్నల్….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: టిచర్స్ కాలనీలో కాలువపై ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి వరద కాలువ నిర్మాణ పనులు ప్రారంభించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అధికారులను ఆదేశించారు.
నగర పాలక సంస్థ ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో కలిసి టీచర్స్ కాలనీ, శ్రీనగర్ కాలనీలను మేయర్ పరిశీలించారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. డీఎంఎఫ్‌టీ నిధులు రూ.4 కోట్లతో ప్రతిపాదించిన వరద కాలువ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి అయితే వర్షాకాలంలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
కాలువ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే జారీ చేసిన ఆదేశాల మేరకు కాలువపై ఏర్పడిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని మేయర్ స్పష్టం చేశారు. శనివారం నుంచి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వడ్లూరి రవి, గట్ల రమేష్, చిదురాల నాగరాజు, బాలసాని తిరుపతి, టీపీఎస్ నవీన్, ఏఈ తేజస్విని తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
