గాజులరామారం సర్కిల్ పరిధిలోని మహదేవపురం మరియు గాజులరామారం డివిజన్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం…
సాక్షిత : గాజులరామారం మరియు మహాదేవపురం డివిజన్ల కాంగ్రెస్ ముఖ్య నాయకులు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ రెండు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి అవకాశం వచ్చిన అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్, ఇంద్రసేనారెడ్డి, పిసిసి మాజీ కార్యదర్శి సొంటి రెడ్డి పున్నారెడ్డి, సిహెచ్ బుచ్చిరెడ్డి, రషీద్ బేగ్, దంపనబోయిన శ్రీనివాస్, డేగల సతీష్, యాము సాగర్, దుగ్యాల ప్రసాద్, ఎండి తౌఫిక్, డాన్ శ్రీను, లక్ష్మీనారాయణ రెడ్డి, నరేందర్ రెడ్డి, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY