కాంగ్రెస్ నాయకుల దాడులను ఖండించిన లింగయ్య యాదవ్
దాడులు ఆపకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిక
సాక్షిత సూర్యాపేట జిల్లాప్రతినిధి : సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వరుస దాడులకు పాల్పడుతున్నారని తీవ్రంగా ఖండిస్తూ, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయని విమర్శించారు. రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమైందని, అరాచక శక్తులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో చట్టవ్యవస్థ దెబ్బతింటోందని ఆయన ఆరోపించారు. ఇటీవల 24వ వార్డు, 26వ వార్డు, నిన్న 9వ వార్డులో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ, బీఆర్‌ఎస్ నాయకులపై వరుసగా దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.
బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు చేస్తే సహించేది లేదని స్పష్టం చేసిన ఆయన, స్థానిక మంత్రులు తమ పార్టీ నాయకులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటనలపై నిష్పక్షపాత విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులు ఆపకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపట్టడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం, మాజీ జడ్పీటీసీ జీడీ బిక్షం, పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, కార్యదర్శి బూర బాలసైదులు గౌడ్, మాజీ కౌన్సిలర్లు తాహేర్ పాషా, భత్తుల జానీ, మాజీ సర్పంచ్ శ్యామ్, అమరవాది శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
