కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం ఎమ్మెస్ పి జీవో ప్రతుల దగ్ధం

Sakshitha news

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం ఎమ్మెస్ పి జీవో ప్రతుల దగ్ధం

సాక్షిత మోతే: రావిపహడ్ గ్రామంలో ఎం ఎస్ పి ఆర్డర్ ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలియజేసిన అఖిలభారత రైతు కూలి సంఘం ( ఏఐకేఎంఎస్ ) జిల్లా నాయకులు కోట మధుసూదన్ రెడ్డి ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కొనుకుంట్ల సైదులు పాల్గొని ప్రసంగించారు.

రావి పహాడ్ గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సంయుక్త కిసాన్ మోర్చా ( ఎస్ కె ఎం ) జాతీయ కమిటీ పిలుపుమేరకు ఎం ఎస్ పి ఆర్డర్ పతులను దగధం చేయడం జరిగింది

ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కోట మధుసూదన్ రెడ్డి ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అనుసరించి వ్యవసాయ రంగాన్ని దివాలా తీస్తుందని అన్నారు 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచడానికి ఎన్నికల సమయంలో హామీ తుంగలో తొక్కిందని ఎద్దేవా చేశారురైతాంగం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున oఆందోళన చేసినప్పటికీ రైతుల గోసను పరిణంలోకి తీసుకోకుండా కంటి తుడుపు ఇప్పుడు చర్యగా నామమాత్ర పెంచుతూ నిర్ణయం చేయడం అంటేనే రైతాంగాన్ని పూర్తిగా సంక్షోభంలోనికి నెట్టడమేనని అన్నారు విత్తనాలు రసాయన ఎరువులు పురుగు మందులు కూలీల వేతనాలు డిజిల్ విద్యుత్ సాగునీరు మొదలైన ఉత్పత్తి కారకాల ధరలు ఆకాశాన్నంటుతున్న ఎం ఎస్ పి ఎ2+fl ప్రకారం ధరలు నిర్ణయించడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం అన్నారు ప్రభుత్వం ప్రకటించిన ఎం ఎస్ పి కి రైతులు పెట్టిన పెట్టుబడులకు ఏమాత్రం సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో పండించే సాధారణ ఏ గ్రేడ్ వరి పంటలకు 72 రూపాయలు మొక్కజొన్న 10 పత్తి 557 పెసల్లు 12 రూ” లు మాత్రమే పెంచడం వ్యవసాయరంగాన్ని దెబ్బతీయడమేనని అన్నారు
ప్రభుత్వం అమెరికా డబ్ల్యూటీవో ఒత్తిడికి తలోగ్గి వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని తొలగించడం వలన అన్ని రకాల పంటల ఉత్పత్తులు ప్రమాదంలో పడ్డాయని అన్నారు ఇప్పటికే రైతులు కూలీలు చేసిన అప్పులు తీర్చలేక పండించిన పంటలకు ధరలు లేక రోజుకు 173 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని కనీస మద్దతు ధర కల్పిస్తూ ఎమ్మెస్ పి చట్టం చేయాలని రైతంగం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు రైతే దేశానికి వెన్నుముకంటూనే రైతుకు వెన్నుపోటు పొడిచే మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి పొడపంగి ముత్తయ్య ఏ ఏ కె ఎమ్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నిమ్మల మల్లయ్య, ఉపసర్పంచ్ ఎస్ కే ఐమాద్ బాబా, మోత్కూరి వీరాచారి, శీలం ఉప్పలయ్య, వేల్పుల లింగయ్య, పెరుగు వేణు, కొంచెం లింగరాజు, కొడిద లింగయ్య, కొత్తపెళ్లి ఉప్పలయ్య,తదితరులు పాల్గొన్నారు

Scroll to Top