తెలుగు ప్రజల పండుగ – మహానాడు విజయవంతం చేద్దాం
సాక్షిత : పర్యావరణ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపు పాటిస్తూ ఆదర్శంగా నిలవాలని సంకల్పించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహానాడు పండుగను ప్రతి నియోజకవర్గంలో క్లస్టర్ వారీగా డిజిటల్ పద్ధతిలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం ఎంతో అభినందనీయం.దేశ ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఒక ఆదర్శంగా నిలవాలని బాబు తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా, తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఈ నెల 27, 28 తేదీలలో వర్చువల్‌గా నిర్వహించనున్న మహానాడు కార్యక్రమం విజయవంతం కోసం ఈ రోజు హార్స్లీ హిల్స్ కన్వెన్షన్ హాల్‌లో మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ మరియు బూత్ ఇంచార్జీలు, అలాగే నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించాము.ఈ సందర్భంగా ప్రతి క్లస్టర్‌లోని నాయకులు సమన్వయంతో పని చేసి మహానాడు కార్యక్రమాన్ని ఘనవిజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొని మార్గదర్శకాలు అందించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
