వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న స్థానిక కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ …
కుత్బుల్లాపూర్ లో వెలసిన 168 సంవత్సరాల చరిత్ర కలిగిన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి సేవలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఆ వేణుగోపాలస్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు, అనంతరం ఆలయ కమిటీ వారు శాలువాతో సత్కరించారు…
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి పురాతన చరిత్ర కలిగిన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని, నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు…
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ & ధర్మకర్త ఠాకూర్ రాజేందర్ సింగ్, శ్రీరాములు గౌడ్, నల్ల లింగం గౌడ్, మనోహర్, లక్ష్మణ్, పులి బలరాం, నర్సింగ్ [ATM] మరియు స్థానిక డివిజన్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు..

