టాస్క్ ఫోర్స్ ఏఎస్పీగా కులశేఖర్
** ఎస్పీని కలసి బాధ్యతలు స్వీకరణ
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) అదనపు ఎస్పీగా జె. కులశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన తిరుపతి ఎఎస్పీ (శాంతి భద్రతలు) గా పని చేశారు. ఆయనను టాస్క్ ఫోర్స్ కు అటాచ్ చేయడంతో శనివారం బాధ్యతలు స్వీకరించారు. తరువాత ఆయన టాస్క్ ఫోర్స్ హెడ్ అండ్ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడుని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అలాగే టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ తో కూడా సమావేశమయ్యారు. ఎఎస్పీకి టాస్క్ ఫోర్స్ పనితీరు గురించి వివరించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
