కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు KPHB డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు … మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనుచౌదరి ని కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై వినతి పత్రాలు సమర్పించారు.. ముఖ్యంగా కేపిహెచ్పి డివిజన్లోని రమ్య గ్రౌండ్ లో పాఠశాల నిర్మాణానికి సంబంధించి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని.. ఆ స్థలాన్ని ghmc కి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని.. నిరుపేదలకు ఉపయోగపడే పాఠశాల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరారు..
ఇప్పటికే పాఠశాల నిర్మాణం కొరకు పునాదులు వేసామని పనులు ముందుకు సాగక అక్కడ అస్తవ్యస్తంగా తయారైందని పాఠశాల నిర్మాణం పూర్తయితే ఎంతో మంది నిరుపేదలకు ఉపయోగపడుతుందని తెలిపారు…అలాగే వసంత్ నగర్, సర్దార్ పటేల్ నగర్, NRSA కాలనీలకు సంబంధించి నిర్మాణ పనులకు అడ్డంకి లేకుండా చూడాలని కోరారు… ఈ కార్యక్రమంలో అల్లాపూర్ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్, కెపిహెచ్బి డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్, యర్ర నాగేశ్వరరావు, హనుమంతరావు, సాంబశివరావు, మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
