కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్

Sakshitha news

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీనగర్‌లో నిర్వహించిన శ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ అమ్మవారిని దర్శించుకున్నారు..

అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, భక్తి భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శ్రీశైలం గౌడ్ కి శాలువ తో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు…

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రవీణ్ గుప్తా మరియు సభ్యులు ప్రవీణ్ గౌడ్,అరుణ్ రెడ్డి, మల్లేష్ గౌడ్, రాములు, అరవింద్,సిద్ధులు, వాసు,శ్రీకాంత్ రెడ్డి,నరసింహ గౌడ్, వెంకటేష్, గణేష్, బాలు, అప్పల శీను,లక్ష్మణ్, శ్రీనివాస్, వెంకట్, భాగ్యలక్ష్మి మరియు స్థానిక నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…

Scroll to Top