*ఎప్ సెట్ లో కోదాడ ఎన్ ఆర్ ఎస్ విద్యార్థుల
….
సాక్షిత:
అత్యుత్తమ ర్యాంకులు సాధించిన కాలేజ్ విద్యార్థులు.
అభినందించిన కాలేజ్ యాజమాన్యం.
ఆదివారం ప్రకటించిన ఎప్ సెట్ ఫలితాలలో కోదాడ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఎస్ కాలేజ్ విద్యార్థులు తమ ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. కాలేజ్ కు చెందిన మండవ శ్రీశశి 1858 ర్యాంకు సాధించగా, పొనగండ్ల పల్లవి 2341 ర్యాంకు, లక్కం రక్షిత 3130 ర్యాంక్, పొందూరు అమృత సుధావర్షిణి 4849 ర్యాంకులు సాధించారు.
వీరితో పాటు చలికంటి త్రివేణి 9117 , రెహానా భాను 11386, భుక్య లక్ష్మీపార్వతి 12361, ఆంగోటు మేఘన 14270, బొజ్జ గణేష్ 14685, పులి రితిక 14696 ర్యాంకులు సాధించినట్లు కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి తెలిపారు. వీరు కాక మరో 6గురు విద్యార్థులు 20వేల లోపు ర్యాంకులు సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ , అకడమిక్ అడ్వైజర మైనం రామయ్యలు అభినందించారు. తమ కాలేజ్ కు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పీ ఎన్ ఆర్, లెక్చరర్ నటరాజ్, క్యాంపస్ ఇంచార్జ్ లు మౌనిక, ప్రవీణ్, పలువురు లెక్చరర్లు లు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
