కరాటే పోటిల్లో కోదాడ కిట్స్ విద్యార్థి నికి బంగారు పతకం
సాక్షిత : సూర్యాపేట జిల్లా కోదాడ లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి నికి ఖమ్మం లో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్షిప్ కరాటే పోటిల్లో ప్రతిభ కనబరిచారు.
ఈ పోటిల్లో బీటెక్ ఎలక్టికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎం. అంజలి బంగారు పతకం సాధించింది.ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించిన విద్యార్థినిని కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ అభినందించారు.
ఈ కార్యక్రమం లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, ఎలక్ట్రికల్ విభాగాధిపతి డాక్టర్ శివాజీ,విభాగాదిపతులు,
అధ్యాపకులు, కరాటే శిక్షకులు మాధవి లత అభినందించారు.


