సొమ్ము దాతలది ఫోటోలు ముఖ్యమంత్రి ముద్రించుకోవడం సిగ్గుచేటు

Sakshitha news

సొమ్ము దాతలది ఫోటోలు ముఖ్యమంత్రి ముద్రించుకోవడం సిగ్గుచేటు…… మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం

*సాక్షిత వనపర్తి : వనపర్తి నియోజకవర్గంలో దశాబ్దాలుగా ప్రజల కు అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించడానికి అంబులెన్స్లు అందుబాటులో ఉండేవి కావని ఎవరికైనా అవసరం పడితే వేలకు వేలు పోసి ప్రైవేట్ అంబులెన్స్లను ఉపయోగించే వారిని అలాంటి పరిస్థితుల్లో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఒక అంబులెన్స్ సమకూర్చడం జరిగిందని కానీ నిర్వహణకు నోచుకొక పోవడంతో అది కూడా పని చేసేది కాదని తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిగా నియోజకవర్గంలో అన్ని మండలాలకు కొల్లాపూర్ అలంపూర్ నియోజకవర్గాల్లో 9 అంబులెన్స్లను కొన్ని సిఎస్ ఆర్ ఫండ్ ద్వారా వ్యక్తిగత సొమ్ముతో శ్రేయోభిలాషులు స్నేహితులు దాతల సహకారంతో సమకూర్చడం జరిగిందని వివరిస్తూ తాను బాధ్యత వహించి జిల్లా ప్రజల సౌకర్యం కోసం సొంతంగా దాతల సహాయంతో ఏర్పాటు చేస్తే సర్కారు నయా పైసా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించుకోవడం సిగ్గుచేటని అలాకాకుండా సర్కారు నిధులు ఇచ్చి స్టిక్కర్లు అతికించుకుంటే బాగుండేదని మంగళవారం మాజీ మంత్రి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రినీ సందర్శించిన సందర్భంగా పై విధంగాఘాటుగా విమర్శించారు.