అమెరికా కాంసలేట్ రోడ్డుకు డోనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడం దేశద్రోహం కాదా………. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నూరు రవీందర్
సాక్షిత వనపర్తి
అమెరికా కాంసలేట్ రోడ్డుకుడోనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది దేశ ద్రోహం కాదా అని భారతదేశంపై తారీఫ్ ల మోత మోగించినందుకా లేక చదువుకోడానికి ఆ దేశానికి వెళుతున్న ఇక్కడి విద్యార్థులకు వీసా పేరుతో ఆంక్షలు విధిస్తున్నందుకా ఆ పేరు పెట్టారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నూరు రవీందర్ పత్రిక ప్రకటనలో ఘాటుగా విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో దేశాల కన్సోలేట్లు ఉన్న రోడ్లు ఉన్నాయని ఆ రోడ్లకు వాళ్ళ దేశ అధ్యక్షుల పేర్లు పెడతారా అని ట్రంప్ పేరు పెట్టేముందు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అలాగే కాకతీయ మహారాణి రుద్రమదేవి పేర్లు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు ఇప్పటికే నంది అవార్డుల పేరు మార్చి గద్దర్ పేరు పెట్టడంతో గద్దర్ భావాలని అంగీకరించినట్లు కాదా అని ఇదంతా ప్రజలు అన్ని గమనిస్తున్నారని అవసరమైనప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తారని అన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
