విగ్రహ ఏర్పాటు పనుల పరిశీలన

Sakshitha news

విగ్రహ ఏర్పాటు పనుల పరిశీలన


సికింద్రాబాద్ : సీతాఫలమండీ కూడలిలో తన స్వంత ఖర్చుతో ఏర్పాటుచేయననున్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్ జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటు పనులను సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల్లో నిరంతరం స్పూర్తిని రేకెత్తించేలా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని, వారి అదర్శాలను పాటించేలా తన వంతు కృషి చేస్తున్నానని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. సీతాఫలమండీ ఎస్.సీ., ఎస్. టీ. సంఘాల నేత జీ. చంద్రశేఖర్, బీ. ఆర్. ఎస్. సమన్వయకర్త రాజా సుందర్, నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top